భారత్-పాకిస్థాన్ సరిహద్దులో రెండు జింకలు ఓ రేంజ్ లో యుద్ధం చేసుకున్నాయి. బోర్డర్ కు అవతల ఒక జింక, ఇవతల మరో జింక తమ కొమ్ములతో కుమ్ముకున్నాయి. ఎక్కడా రెండు జింకలు పోరాడే విషయంలో తగ్గలేదు. ఒకదానిని ఒకటి బలంగా కుమ్ముకున్నాయి. ఇలా ఇవి భీకరంగా తలపడుతున్న సమయంలో ఒక బీఎస్ఎఫ్ ఆఫీసర్ సెల్ ఫోన్ కు పని చెప్పారు. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సరిహద్దు దగ్గర సాధారణ సన్నివేశానికి ఊహించని ట్విస్ట్ అనే క్యాప్షన్ జోడించారు. ఈ వీడియో ప్రస్తుతం ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఉల్లాసభరితమైన కొట్లాట నెటిజన్లను ఆకర్షించింది. “ఇండియా వర్సెస్ పాకిస్తాన్” మ్యాచ్ అని హాస్యాస్పదంగా వ్యాఖ్యానిస్తున్నారు. మరికొందరు ఎక్కడా తగ్గెదెలా.. అది ఆర్మీ అయినా భారత క్రీడాకారులైనా సరే చివరకు జింక కూడా పాక్ కు జింకకు గట్టిగానే బుద్ది చెప్పిందిగా అని కామెంట్ చేశారు. భారత్ జోలికి వస్తే నోరులేని జీవాలు సైతం ఊరుకోవంటూ కూడా మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో ట్రెండింగ్ లో నిలిచింది.