పానీ పూరీ మన దేశంలో ప్రసిద్ది చెందిన స్ట్రీట్ ఫుడ్. మంచి టేస్టుతో తక్కువ ధరతో దొరికే గోల్గాప్పను యువతీ యువకులు అత్యంత ఇష్టంగా తింటారు. అసలు పానీ పూరీ పేరు వింటే చాలు చాలామందికి నోట్లో నీరు తిరుగుతుంది కూడా. సాయంత్రం అయిందంటే చాలు వీధుల్లో పానీ పూరీ బండి దగ్గరకు చేరుకుంటారు యువతీ యువకులు. దేశంలో ఒకొక్క ప్రాంతలో ఒక్కక పేరుతో పిలిచే ఈ స్ట్రీట్ ఫుడ్ సేఫ్టిపై ఇప్పటికే పనులు మార్లు అనుమానం వ్యక్తం కాగా తాజాగా కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పానీ పూరీ నమూనాలను పరీక్షించి షాకింగ్ ఫలితాలను కనుగొన్నారు. అధికారులు సేకరించిన పానీ పూరీ శాంపిల్స్‌లో 22% భద్రతా ప్రమాణాలు విఫలమైనట్లు వెల్లడైందని చెప్పారు.
నివేదికల ప్రకారం సేకరించిన 260 శాంపిల్స్ లో కృత్రిమ రంగులు, 41 శాంపిల్స్ లో క్యాన్సర్‌కు కారణమయ్యే క్యాన్సర్ కారకాలు.. మిగిలిన 18శాంపిల్స్ లో అసలు మనిషి తినడానికి పనికి రావు అని ల్యాబ్ టెస్ట్ లో వెల్లడైంది అని అధికారులు ప్రకటించారు.
ఈ విషయంపై ఆహార భద్రత కమిషనర్ శ్రీనివాస్ కె మాట్లాడుతూ.. “రాష్ట్రవ్యాప్తంగా వీధుల్లో అమ్ముతున్న పానీ పూరీ నాణ్యతపై తమకు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. దీంతో తాము రాష్ట్రం నలుమూల్లో ఉన్న రోడ్ సైడ్ స్టాల్స్ తో పాటు పేరున్న రెస్టారెంట్ల నుంచి కూడా పానీ పూరి శాంపిల్స్ ను సేకరించినట్లు తెలిపారు. చాలా శాంపిల్స్ లో పానీ పూరీలు పాడయ్యే స్టేజ్ లో ఉన్నట్లు.. అసలు అవి తినడానికి కూడా పనికిరావని గుర్తించినట్లు వెల్లడించారు. బ్రిలియంట్ బ్లూ, సూర్యాస్తమయం పసుపు, టార్ట్రాజైన్ (టార్ట్రాజైన్ అనేది సింథటిక్ పసుపు ఆహార రంగు. ఇది పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తయారు చేస్తారు) వంటి రసాయనాలు పానీ పూరి శాంపిల్స్ లో ఉన్నట్లు వెల్లడైంది. ఇవి వివిధ ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ వంటి వంటలలో విరివిగా ఉపయోగించే ఫుడ్ కలర్స్ ను ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం నిషేధించింది. ఎవరైనా సరే తమ రెస్టారెంట్లలో తయారు చేసే ఆహార పదార్ధాల్లో ఈ రసాయనాలను వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు. ఇదే విషయంపై మంత్రి దినేష్ మాట్లాడుతూ..“రాష్ట్రంలో ఆహార భద్రత తమ మొదటి ప్రాధాన్యత అని వీటిని తయారు చేసే సమయంలో ఏ కృత్రిమ రంగులు ఉపయోగిస్తున్నారో తెలుసుకునేందుకు , మరిన్ని వంటకాలను తనిఖీ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు తాము ఎలాంటి ఆహారాన్ని తింటున్నాము.. అసలు వాటిని ఎలా తయారు చేస్తున్నారు అన్న విషయాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. రెస్టారెంట్ యజమానులు కూడా పరిశుభ్రతను కాపాడడానికి తగినంత బాధ్యత వహించాలి. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆరోగ్య మంత్రి హెచ్చరించారు. అయితే ఫిబ్రవరిలో తమిళనాడు ప్రభుత్వం కూడా కాటన్ మిఠాయి లో హానికరమైన రసాయనాలు ఉన్నాయని వాటి వినియోగాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే..