top of page

‘పాపా.. మీరు చెప్పిన పాఠాలే నాకు స్ఫూర్తి’..

MediaFx

మంగళవారం ఉదయం ఢిల్లీలోని వీర్‌ భూమి (Veer Bhumi)ని సందర్శించి రాజీవ్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించారు. పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అదేవిధంగా తండ్రి జయంతి సందర్భంగా రాహుల్‌ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ పెట్టారు. ‘దయగల వ్యక్తిత్వం, సహృదయత, సద్భావనకు ప్రతిరూపం.. పాపా, మీరు చెప్పిన పాఠాలే నాకు స్ఫూర్తి. భారతదేశం కోసం మీరు కన్న కలలు నా సొంతం. నేను వాటిని నెరవేరుస్తాను’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సైతం మాజీ ప్రధానికి నివాళులర్పించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు. ‘మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు’ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్సన్ సోనియా గాంధీ, జైరాం రమేశ్‌ సహా పలువురు నాయకులు రాజీవ్ గాంధీకి సోషల్‌ మీడియా ద్వారా నివాళులర్పించారు.



 
bottom of page