ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్లకు ఆదరణ బాగా పెరిగింది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరికీ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండాల్సి వచ్చింది. స్మార్ట్ ఫోన్లు నిత్యావసర వస్తువులుగా మారాయి. అయితే పెద్దల వినియోగం పక్కన పెడితే, పిల్లలు మాత్రం ప్రతి చిన్న విషయానికి స్మార్ట్ ఫోన్‌పై ఆధారపడుతున్నారు. ఇది వారి ఆలోచనా శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రులు కమ్యూనికేషన్ కోసం స్మార్ట్ ఫోన్లు ఇవ్వాల్సి వస్తుంది. అయితే స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలు ఎల్లప్పుడూ సోషల్ మీడియాకు కనెక్ట్ కావడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను నుంచి బయటపడేందుకు తల్లిదండ్రులు పిల్లలకు కీ ప్యాడ్ ఫోన్లను ఇస్తున్నారు.
హార్వర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు యువతకు వ్యసనంగా మారాయి. యూకేలోని ఐదు నుంచి ఏడు సంవత్సరాల పిల్లల్లో నాలుగింట ఒక వంతు సొంత స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్నారు. సోషల్ మీడియా వినియోగం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా పిల్లలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేలింది.
ఉత్తర అమెరికాలో డంబ్‌ఫోన్‌ల విక్రయాలు పెరుగుతున్నాయి. లాస్ ఏంజిల్స్‌లోని డంబ్‌వైర్‌లెస్ స్టోర్ యజమానులు డైసీ క్రిగ్‌బామ్, విల్ స్టల్ట్స్ తక్కువ టెక్ పరికరాల కోసం వెతుకుతున్న కస్టమర్‌లు పెరిగారన్నారు. పాఠశాలల్లో విద్యార్థులు నిర్దిష్ట యాప్‌లు ఉండాలని, కానీ సోషల్ మీడియా యాప్స్ లేని ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి డంబ్ ఫోన్లు ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు సాధారణ స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా యాప్స్ లాక్ చేసే ఫీచర్లను చూస్తున్నారు. మొత్తం మీద తల్లిదండ్రులు పిల్లలను స్మార్ట్ ఫోన్లతో పాటు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంచాలని కోరుకుంటున్నారు.