top of page
MediaFx

కిరాణా షాపు నుంచి కోటీశ్వరురాలి దాకా పవిత్ర గౌడ లైఫ్ జర్నీ చూస్తే మైండ్ బ్లాక్

కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరో దర్శన్ తన వీరాభిమాని రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసి కటకటాల పాలయ్యాడు. దర్శన్ ప్రియురాలు పవిత్ర గౌడతో కలిసి మొత్తం 19 మందిని బెంగుళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులకు శిక్ష పడాలని, రేణుకాస్వామి భార్యకు న్యాయం జరగాలని ప్రజలు, సినీతారలు కోరుతున్నారు.

ఇప్పటికే పెళ్లై బాబు ఉన్న దర్శన్.. గత పదేళ్లుగా నటి పవిత్ర గౌడతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఇటీవల పవిత్ర గౌడకు, దర్శన్ భార్య విజయలక్ష్మికి సోషల్ మీడియాలో గొడవలు జరిగాయి. రేణుకాస్వామి పవిత్ర గౌడకు అసభ్యకరంగా మెసేజ్‌లు చేయడంతో దర్శన్ అతడిని కిడ్నాప్ చేసి హత్య చేశాడు.

పవిత్ర గౌడ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి కిరాణా దుకాణం యజమాని. బిషప్ కాటన్ కాలేజీలో బీసీఏ డిగ్రీ చేసి, సిస్టమ్ డిజైనింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి సినీరంగంలోకి అడుగుపెట్టింది. పవిత్ర పలు జ్యువెలరీ ప్రకటనల్లో కనిపించి, మిస్ బెంగళూరుగా నిలిచింది. బుల్లితెరపై పలు సీరియల్స్ చేసి, రెండు సినిమాల్లో కథానాయికగా నటించింది.

దర్శన్‌తో ఉన్న అనుబంధం వల్లే ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచింది. పవిత్రకు పెళ్లి అయి విడాకులు వచ్చాయి. దర్శన్‌తో లివ్ ఇన్ రిలేషన్ షిప్‌ ద్వారా ఆమె కోటీశ్వరురాలైందని చెప్పుకుంటున్నారు. దర్శన్ బహుమతిగా మూడు అంతస్తుల ఇల్లు, లగ్జరీ కారు ఇచ్చినట్లు సమాచారం.


bottom of page