పవన్ వరస నాలుగు సినిమాలు..
- Srinivas Cheepuri
- Apr 11, 2023
- 2 min read
పవర్ స్టార్ సినిమాల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. కనీసం పవన్ సినిమా అప్డేట్స్ వస్తే చాలు అన్న రేంజ్లో ఆయనకు అభిమానులు ఉంటారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాజకీయాల్లో తనేంటో చూపిస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తూండటం చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తోంది. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. ఆ సినమాలు రిలీజ్ డేట్స్ సైతం ఫిక్స్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. అఫీషియల్ గానూ, అనఫీషియల్ గా ప్రచారం లో ఉన్న ఆ చిత్రాల రిలీజ్ డేట్స్ చూద్దాం. ప్రముఖ నటుడు సముద్రఖని దర్శకత్వంలో వస్తోన్న ఫాంటసీ డ్రామా మూవీ. ఇందులో పవన్ కళ్యాణ్ తో పాటు నటుడు సాయి ధరమ్ తేజ్ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. మామ అల్లుళ్ల కలయికలో వస్తోన్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమాను తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోధాయ సీతమ్’ సినిమాకు రిమేక్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ మూవీకు సంబంధించిన కొన్ని మేకింగ్ ఫోటోలు లీక్ అయ్యాయి. ఆ ఫోటోలలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆయన పక్కనే సాయి ధరమ్ తేజ్ కూడా నిలబడి ఉన్నారు. ఇప్పుడా ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం జూలై 28 , 2023 న రిలీజ్ చేస్తున్నారు. సినిమా కథ విషయానికొస్తే.. అనుకోని ప్రమాదంలో చనిపోయిన ఓ వ్యక్తికి దేవుడు సెకండ్ ఛాన్స్ ఇస్తే ఎలా ఉంటుంది అనే పాయింట్ మీద కథ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఒరిజినల్ కథను అలాగే ఉంచుతారా లేదా తెలుగు నేటివిటీకు తగ్గట్టు మార్పులు చేస్తారా అనేది చూడాలి. ఇక ఈ సినిమాకు ‘దేవర’, ‘దేవుడు’ అనే టైటిల్స్ పరిశీలనలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారని సమాచారం. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉంటుందో చూడాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే..

#HariHaraVeeraMallu పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హరిహరవీరమల్లు ( Hari Hara Veera Mallu) ఈ చిత్రం రిలీజ్ డేట్‌పై నిర్మాత ఏ.ఎమ్ రత్నం ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. పీరియాడికల్ యాక్.న్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని దీపావళి 2023న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇందులో మొఘలుల కాలం నాటి బందిపోటు దొంగగా పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని సమాచారం. పాన్ ఇండియన్ సినిమా ఇదని, పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఏ.ఎమ్ రత్నం అన్నాడు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పంచమి అనే పాత్రలో నిధి అగర్వాల్ కనిపించబోతున్నది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. #OG 3 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సుజీత్ కు పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం దక్కింది. ఈ ప్రాజెక్టు ‘ఓజి’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ చిత్రం షూటింగ్ కు ప్లానింగ్ జరుగుతోంది. ఈ సినిమాని అతి తక్కువ డేట్స్ లో పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2023న విడుదల చేస్తారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు ‘ఓజి’ కథ ఎలా ఉండబోతుంది అనే విషయంపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ అంటున్నాడు..ఇదిలా ఉండగా.. ‘ఓజి’ లో అసలు పాటలు ఉండవు, హీరోయిన్లు ఉండరు అని కూడా చెబుతున్నారు.

ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇక కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ప్రీ లుక్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి పవర్ స్టార్ లుక్ నెట్టింట లీకైంది. అందులో భీమ్లా నాయక్ చిత్రం తరహా లుక్ ని అప్డేట్ చేసిన వెర్షన్ లో లుంగీతో.. లైట్ గా గడ్డంతో కనిపిస్తున్నారు పవన్. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం సినిమా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయి ధరమ్ తేజ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి 2024 న రిలీజ్ అవుతుందని అంటున్నారు.