top of page
MediaFx

అసెంబ్లీలోనే జనసేన నేతలకు వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్..


ఏపీ భవిష్యత్తు, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం జనసేన పార్టీ టీడీపీ కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో ఏపీ ఖజానా ఖాళీ కావటంతో పాటు రాజధాని అమరావతి నిర్మాణం, జీవనాడి పోలవరం ప్రాజెక్టు గిపోయాయని విమర్శించారు. సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అవసరం రాష్ట్రానికి ఎంతో ఉందన్న పవన్ కళ్యాణ్.. ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేస్తామని చెప్పారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉచిత ఇసుక వంటి వ్యవహారాల్లో జనసేన సభ్యుల పాత్ర ఉండకూడదు. కూటమి ప్రభుత్వానికి ఇబ్బందులు కలుగజేసేలా వ్యవహరిస్తే ఏ సభ్యుడినైనా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తప్పులు చేస్తే నాతో సహా ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకోండి. వ్యక్తులు తప్పులు చేస్తే వ్యక్తిగతంగా వారికే ఆపాదించాలి కానీ పార్టీలకు కాదు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు కనుసన్నల్లో పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా" అని పవన్ కళ్యాణ్ అన్నారు. దీంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా జనసేన ఎమ్మెల్యేలు ఎవరూ నడుచుకోవద్దంటూ అసెంబ్లీ వేదికగానే జనసేనాని స్వీట్ వార్నింగ్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

bottom of page