🍿💰 బ్రో.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే.. 😮🌟
- Suresh D
- Jul 29, 2023
- 1 min read
🎬 భీమ్లానాయక్ సినిమా తర్వాత పవన్ చేస్తున్న మూవీ.. అటు విరూపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.

🎬 భీమ్లానాయక్ సినిమా తర్వాత పవన్ చేస్తున్న మూవీ.. అటు విరూపాక్ష లాంటి హిట్ తర్వాత తేజ్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిన్న థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ మూవీ మొదటి రోజు భారీ ఓపినింగ్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. బ్రో మూవీ రూ.30 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే వర్షాల కారణంగా ఈ మూవీకి 20 కోట్ల వరకు వసూల్ చేస్తుందని అంచనా వేశారు ట్రేడ్ వర్గాలు. కానీ అంచనాలకు మించి 30 కోట్లు వసూల్ చేసింది బ్రో మూవీ. నైజం ఏరియాలో బ్రో మూవీ రూ 14 కోట్లు వసూల్ చేసిందని టాక్. ఇక బ్రో సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో భారీ వసూళ్లను రాబట్టడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. 🍀💵🎞️🔥