top of page

‘బ్రో’ మూవీ రివ్యూ.. 🎥

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. పాటలు కావాలా.. ఓకే ఉన్నాయి. 🎶 డాన్సులు కావాలా ఓ ఊపేయకపోయినా పర్లేదు సర్దుకోవచ్చు. 👯‍♂️💃 కామెడీ కావాలా నవ్వుకోవచ్చు.. 😂 ఫ్యామిలీ ఎమోషన్స్ ఓకే. 😊👪 మంచి కథ కూడా ఉంది.. 👌📜 బ్రో సినిమాలో అన్నీ ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎలా ఉండాలి.. పాటలు కావాలా.. ఓకే ఉన్నాయి. 🎶 డాన్సులు కావాలా ఓ ఊపేయకపోయినా పర్లేదు సర్దుకోవచ్చు. 👯‍♂️💃 కామెడీ కావాలా నవ్వుకోవచ్చు.. 😂 ఫ్యామిలీ ఎమోషన్స్ ఓకే. 😊👪 మంచి కథ కూడా ఉంది.. 👌📜 బ్రో సినిమాలో అన్నీ ఉన్నాయి. 👏🌟 పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇంతకంటే ఏం కావాలి..? 😍💬 సముద్రఖని కూడా ఇదే లెక్కలేసుకుని మరీ బ్రో సినిమా తీసినట్లు అనిపిస్తుంది. 🧐 దానికి త్రివిక్రమ్ కూడా తోడు కావడంతో ఫ్యామిలీ సినిమా ఒకటి బయటికి వచ్చింది. 🤝 పవన్ లాంటి స్టార్ హీరోతో చేయాల్సిన సబ్జెక్ట్ అయితే ఇది కాదు.. ఆయన నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు బ్రోలో ఉన్నాయి కానీ కామన్ ఆడియన్స్ కోరుకునే విషయాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. 😐 అందుకే బ్రో సగటు సినిమాగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువ. 🙌 అయితే ఫ్యాన్స్‌కు మాత్రం విందు భోజనం పెట్టేసాడు సముద్రఖని. 🍱 సినిమాలో ఆయన పాత్ర టైమ్ కావడంతో హద్దులు లేకుండా రెచ్చిపోయాడు పవన్. 🎭 తన పాత పాటలకు ఆయన చిన్నపిల్లాడిలా స్టెప్పులేస్తుంటే మురిసిపోయారు ఫ్యాన్స్. 🎤👦 నేను టైమ్ అంటూ వేదాంతం చెబుతుంటే నిజమేగా అనిపిస్తుంది. అభిమానులకు బ్రో బాగానే ఫుల్ మీల్స్ పెడుతుంది. 💖 కామన్ ఆడియన్స్‌కు మాత్రం అక్కడక్కడా లోపాలు కనిపించాయి.. 🤔 ముఖ్యంగా ఫస్టాఫ్ ఆర్టిఫిషియల్ గా ఉంది. 🤨 టైం లేదు టైం లేదు అని తేజ్ అంటుంటాడు.. నిజంగానే ఆ టైం లేక చుట్టేసినట్టు అనిపించింది. 😏 సెకండాఫ్ మాత్రం ఆకట్టుకుంటుంది.. ఎమోషన్స్ కూడా పర్ఫెక్ట్ గా పండాయి.. 😢 పవన్, తేజ్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. 💫 మామ అల్లుళ్ళ మధ్య వచ్చే సీన్స్.. 🤩 తేజ్ ను పవన్ ఆటపట్టించే తీరు బాగుంది. 🤗 ఇది సినిమా కాదు.. సింపుల్ గా లైఫ్ థియరీ. 😌 నువ్వున్నా లేకపోయినా జరిగేది జరగక మానదు.. 🤷‍♂️ రేపు ఏదో అయిపోతుంది అని బాధపడకు.. 😔 ఇప్పుడు ఉన్న టైం ఎంజాయ్ చెయ్ అనేది చెప్పాడు సముద్రఖని. 😎 చివర్లో ఫ్యామిలీ సన్నివేశాలు బాగానే వర్కవట్ అయ్యాయి. 💼 ఓవరాల్‌గా బ్రో.. భారీ అంచనాలు లేకుండా వెళ్తే ఇట్స్ ఓకే బ్రో.. 🏋️‍♂️💥


 
 
bottom of page