తెలుగు రాష్ట్రాల్లో ఆ హీరో సినిమా వచ్చిందంటే థియేటర్లు హౌస్ ఫుల్ కావాల్సిందే. అంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన పవన్.. బద్రి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ఇండస్ట్రీలో పవన్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత తమ్ముడు, ఖుషి వంటి చిత్రాలతో మరిన్ని విజయాలను సొంతం చేసుకున్నాడు. పవన్ యాక్టింగ్, మేనరిజంతో కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరోగా అభిమానుల గుండెల్లో దైవంగా ఉన్నారు. పవన్ రియల్ లైఫ్ హీరో అంటూ ఆయన వ్యక్తిత్వానికి ఫిదా అవుతుంటారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తున్న పవన్.. దాదాపు పదేళ్లుగా రాజకీయాల్లో పోరాటం చేస్తున్నారు. ఇటీవలే ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. పవన్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు. యూత్ మాత్రమే కాదు.. సినీ పెద్దలు, రాజకీయ ప్రముఖులు కూడా పవన్ వ్యక్తిత్వానికి అభిమానులే. ఇదంతా పక్కన పెడితే దాదాపు రెండు దశబ్దాలుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. కానీ ఇన్నేళ్లలో పవన్ కేవలం ఒకే ఒక్క యాడ్ చేశారు. కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన మొదటి యాడ్ పెప్సీ. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ ఇది. అప్పట్లో పెప్సీ కూల్ డ్రింగ్ సంస్థకు పవన్ బ్రాండ్ అంబాసిడర్. సౌత్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాతే మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ ఇచ్చారు.
అప్పట్లో ఎక్కడ చూసిన పవన్ పెప్సీ యాడ్ పోస్టర్ కనిపించేవి. అప్పట్లో పెప్సీ యాడ్ చేసినందుకు ఆయనకు రెమ్యునరేషన్ అధికంగానే ఇచ్చారట. ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ ఏకంగా రూ.70 నుంచి రూ.100 కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారని సమాచారం. అప్పట్లో ఈ రేంజ్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక హీరో పవన్. ఆ తర్వాత పవన్ మరో యాడ్ చేయలేదు. కేవలం సినిమాలపైనే దృష్టి సారించారు. ప్రస్తుతం పవన్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాల్లో నటిస్తున్నారు.