టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారిపోయారు. విడాకులు తరువాత సమంతను ఆరోగ్య సమస్యతు వెంటాడాయి. కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. దీంతో కొంతకాలం సినిమాలకు దూరం ఉన్నారు. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చింది లేదు. ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్రల్ ఇస్తోంది. ''హనీ, బన్నీ'' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు. దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది. ఇదిలా ఉంటే సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్నారని తెలుస్తోంది. ఓ విషయంలో సాయం కోసం సమంత పవన్‌ను కలవనున్నారని సమాచారం. సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చని పోలాలు, చెట్ల మధ్య అమ్మడు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు, ఫొటోలు చాలానే వైరల్ అయ్యాయి. చెట్లు నరకకుండా కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందట సమంత.
అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం, సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరకు వెళ్లి సూచనలు చెప్పడానికి సమంత రెడీ అవుతోందని తెలుస్తోంది. అలాగే తన మాదిరిగా మయోసైటీస్ లాంటి వ్యాధి బారిన పడకుండా సరికొత్త పద్ధతిని పరిచియం చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్ధమవుతోందని తెలుస్తోంది. దీని కోసమే పవన్‌తో సమంత భేటీ కానుంది. పవన్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇచ్చినట్లు తెలుస్తోంది.