పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో సాంగ్ చేశానని.. ఇక మోత మోగిపోవడం ఖాయం అంటూ అసలు విషయం చెప్పేసింది. “ఫస్ట్ టైం ఈ విషయాన్ని రివీల్ చేస్తున్నాను.. ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్తున్నాను.. నేను పవన్ సర్ తో ఒక బ్యూటీఫుల్ డాన్స్ చేశాను. ఆ పాట మోత మోగిపోతుంది” అంటూ హింట్ ఇచ్చేసింది అనసూయ. అయితే ఏ సినిమాలో అనేది మాత్రం క్లారిటీ రాలేదు. పవన్ సినిమాలో అనసూయ పాట అందులోనూ మోత మోగిపోద్ది అని చెప్పడంతో అది కచ్చితంగా స్పెషల్ సాంగ్ అయ్యింటుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. దీంతో ఇప్పుడు పవన్, అనసూయ మధ్యలో రాబోయే స్పెషల్ సాంగ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
గతంలోనూ పలు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో అలరించింది అనసూయ. ఇక ఇప్పుడు ఏకంగా పవన్ తో స్పెషల్ సాంగ్ చేయనుండడంతో ఆ సాంగ్ పై ఓ రేంజ్ హైప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పవన్ సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవే కాకుండా హరిహర వీరమల్లు సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రాలను కంప్లీట్ చేయనున్నారు.