top of page
MediaFx

పవన్ విషయంలో చిరు మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawankalyan) హీరోగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలకి బ్రేక్ ఇచ్చి పవన్ రాజకీయ విషయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఈ క్రమంలో పవన్ కి తోడుగా అనేక మంది సినీ ప్రముఖులు హీరోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ లు చేశారు. మరి వీరితో పాటుగా పవన్ పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక వీడియో బైట్ రీసెంట్ గా చేశారు.

ఇది వైరల్ గా మారగా తాజాగా చిరు మరోసారి పవన్ పై ఆసక్తికర కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. మొదటగా తాను ఏ రాజకీయ పార్టీ లోనూ లేను అని అలాగే కుటుంబం పరంగా పవన్ కి తాము అంతా ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటామని తెలిపారు. అతడు రాజకీయంగా ఎదగాలనే మనసా, వాచా కోరుకుంటున్నామని చిరు కామెంట్స్ చేశారు.

దీనితో ఈ సరికొత్త కామెంట్స్ పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నాక తెలిపారు. ఇక దీని తర్వాత చిరు మళ్ళీ తన భారీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara) లో బిజీ కానున్నారు. ఈ చిత్రాన్ని దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.

bottom of page