ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ విజయంతో పవన్ కళ్యాణ్ కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా, మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే పూర్తి జీతం తీసుకుంటానని, ప్రజల సొమ్ము తింటున్న బాధ్యత తనకు గుర్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేల జీతభత్యాలు, ఇతర అలవెన్సుల గురించి తెలుసుకుందాం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేకు నెలకు ₹1.25 లక్షలు జీతం వస్తుంది. ఎమ్మెల్యే క్వార్టర్స్ అందుబాటులో లేకపోవడంతో HRA కింద ₹50,000 అదనంగా చెల్లిస్తారు. వీటికి తోడు సిట్టింగ్ అలవెన్స్, టెలిఫోన్ సదుపాయాలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ వంటి ఉన్నత హోదాల వారికి ఎక్కువ జీతభత్యాలు అందుతాయి.
ఈ మొత్తం జీతభత్యాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. మాజీ ఎమ్మెల్యేలకి పెన్షన్, మెడికల్, ట్రావెల్ సదుపాయాలు ఉంటాయి. మరణించినా వారి భాగస్వామికి పింఛన్ ఇస్తారు. దేశంలో అత్యధిక జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ, ఇక్కడ MLAలకు ₹2.5 లక్షలు వరకు చెల్లిస్తారు.
పవన్ కళ్యాణ్ జీతం తీసుకోవాలని నిర్ణయించడంతో ఆయనకు నెలకు ₹1.75 లక్షలు వరకు వస్తుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి, మంత్రిగా అదనపు సదుపాయాలు, సౌకర్యాలు కూడా ఉంటాయి.