ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు.
ఓ వైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఏపీ రాజకీయాలతో నిత్యం బిజీగా ఉంటూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరహర వీరమల్లు, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ తెరకెక్కిస్తున్న ఓజీ సినిమాలు చేస్తున్నారు. కొన్నాళ్లుగా హరహర వీరమల్లు గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. దాంతో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీలపై పవన్ ఫోకస్ పెట్టారు. ఉస్తాద్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. కొన్ని రోజుల పాటు హీరో లేని సన్నివేశాలను ఇతర నటీనటులపై చిత్రీకరించారు. మంగళవారం నుంచి పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌లో చేరినట్టు తెలుస్తోంది.హైదరాబాద్ శివార్లలో వేసిన దేవాలయం సెట్‌లో ప్రస్తుతం రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పవన్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్టు సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.🎥🌟