top of page
MediaFx

పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా..?

మన పవర్ స్టార్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఆశపడే వారు, ఆయన డైలాగ్స్ పంచ్ లను ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేయాలని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ నిరాశ చెందవలసి ఉంటుంది.

పవన్ కళ్యాణ్ అనే పేరు వినిపిస్తే వైబ్రేషన్, అగ్రెషన్, ఇన్‌స్పిరేషన్.. ఇలా చాలా ఉంటుంది. అభిమానులు కాదు భక్తులు అని టాలీవుడ్ జనాలు అంటారు. పవన్ సినిమా వస్తే థియేటర్స్ వద్ద పండగే. కానీ పవన్ రాజకీయాల్లోకి వచ్చి సినిమాలు మానేస్తానని ప్రకటించారు. పార్టీకి డబ్బులు కావాలని మళ్ళీ సినిమాలు చేశారు. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టడంతో సినిమాలకు దూరం అవుతున్నారు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ 6 నెలలుగా అసలు సినిమాల వైపు చూడటం లేదు. కమిట్ అయిన మూడు సినిమాలను కంప్లీట్ చేయడానికి అప్పుడప్పుడు షూట్ చేస్తున్నారు. OG సినిమాకు మాత్రం రెండు వారాలు డేట్స్ ఇస్తే షూట్ అయిపోతుంది. మిగిలిన రెండు సినిమాల పరిస్థితి ఇంకా క్లారిటీ లేదు.

పవన్ రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ప్రస్తుతం చేతిలో ఉన్న 3 సినిమాలను మాత్రం పూర్తి చేస్తారని తెలుస్తోంది. కొత్త సినిమాలు చేయడం మాత్రం డౌటే అని టాలీవుడ్ టాక్. అందుకే పవన్ తో సినిమాలు చేయాలనుకునేవాళ్లు ప్రత్యామ్నాయం వెతుకుంటున్నారంట.

bottom of page