పవన్ కళ్యాణ్ OG సినిమా సెప్టెంబర్ 27 విడుదల అని ప్రకటించారు. కానీ ఆ సినిమా షూట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించడంతో షూటింగ్ కి డేట్స్ ఇవ్వలేకపోయారు. దీంతో OG సినిమా వాయిదా పడుతుందని టాలీవుడ్ లో అందరూ భావిస్తున్నారు.
OG వాయిదా పడితే, ఎన్టీఆర్ దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల అవుతుందని కొత్త టాక్ నడుస్తుంది. దేవర సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10 విడుదల చేస్తామని ప్రకటించారు. OG రిలీజ్ కాకపోతే, దేవర ముందుకు వచ్చి సెప్టెంబర్ 27నే రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ విషయం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సంతోషంగా ఉండగా, పవన్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.
OG సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోపక్క, గేమ్ ఛేంజర్ సినిమా ఎప్పుడొస్తుందో అని అభిమానులు మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. కానీ గేమ్ ఛేంజర్ అక్టోబర్ లేదా నవంబర్ లో ఉండొచ్చని నిర్మాతలు తెలిపారు. షూటింగ్ చివరి షెడ్యూల్ జరుగుతుంది. OG వాయిదా పడితే, దేవర ముందుకు వస్తే, గేమ్ ఛేంజర్ సినిమా దసరాకి వచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమాల రిలీజ్ తేదీలను ఖచ్చితంగా తెలియాలంటే మరి కొన్నిరోజులు ఎదురుచూడాల్సిందే.