పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న "ఓజి" చిత్రం, టాలెంటెడ్ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం, పవన్ కెరీర్‌లో చాలాకాలం తర్వాత వస్తున్న పక్కా యాక్షన్ సబ్జెక్టు కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి.
అప్పటివరకు డిసెంబర్ లేదా వచ్చే ఏడాదికి వాయిదా పడవచ్చని ఊహాగానాలు మొదలయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఓటిటి డీల్ పూర్తి కాకపోవడమే. మొదట భారీ ఆఫర్లు వచ్చినా, రిలీజ్ సమయం ఫిక్స్ చేయకపోవడంతో అప్పుడే డీల్ కుదరకపోయింది. ఇప్పుడు సమయం ఫిక్స్ అయినప్పటికీ, ఓటిటి స్లాట్ లేక, విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
సినిమాకు తగిన బడ్జెట్ కూడా ఓటిటి ప్లాట్‌ఫామ్‌లకు లేకపోవడం ఒక కారణంగా వినిపిస్తోంది. సినిమా పై ఉన్న అంచనాలకు తగిన రేటు పలకడం లేదని సమాచారం. దీనితో ఈ ఏడాది చివరలో లేదా వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.