నేడు ఆంధ్రప్రదేశ్ లో ప్రమాణ స్వీకార వేడుక గ్రాండ్ గా జరిగింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా, అనంతరం పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు సభా ప్రాంగణం అంతా హోరెత్తింది. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం విచ్చేసారు.
చిరంజీవి స్టేట్ గెస్ట్ గా ప్రమాణ స్వీకారం వేదికపై కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడులకు నమస్కరించారు. అనంతరం స్టేజిపై ఉన్న అందరు ప్రముఖులకు నమస్కరిస్తూ వెళ్లారు. చివరగా చిరంజీవి వద్దకు వచ్చి కాళ్ళ మీద పడి నమస్కరించాడు. చిరంజీవి పవన్ ని దగ్గరకు తీసుకొని ఆనందంతో హత్తుకున్నాడు.
దీంతో అన్నదమ్ముల అనుబంధం వైరల్ గా మారింది. పవన్ గెలిచినప్పటి నుంచి చిరంజీవి సంతోషంలో ఉన్నారు. తాను చేయలేనిది పవన్ సాధించాడు అని మెగాస్టార్ చిరంజీవి ఆనందంతో ఉన్నారు. ఇప్పటికే పవన్, చిరంజీవి ఇంటికి వెళ్లి కలిసిన వీడియోలు చూసి, అందులో ఈ అన్నదమ్ముల అనుబంధం చూసి మెగా అభిమానులు ఆనంద భాష్పాలు కార్చారు. ఇప్పుడు ఇన్ని వేల మంది ముందు, దేశవ్యాప్తంగా వచ్చిన అతిరథమహారథుల ముందు పవన్ కళ్యాణ్ చిరంజీవి కాళ్ళ మీద పడటంతో పవన్ ని మరోసారి అంతా అభినందిస్తున్నారు. మెగా అభిమానులకు ఇవాళ కడుపు నిండిపోయింది అని చెప్పొచ్చు.