72 సెకన్ల టీజర్ తో అరాచకం సృష్టించనున్న ‘ఓజీ’ టీజర్🎥🎞️
- Suresh D
- Aug 26, 2023
- 1 min read
సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ చిత్రంతో తన సత్తా చూపెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ గా పవన్‌ని ఓ రేంజ్‌లో చూపెట్టబోతున్నాడని తెలుస్తోంది.

సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్ ఇప్పుడు పవన్ చిత్రంతో తన సత్తా చూపెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. గ్యాంగ్ స్టర్ గా పవన్‌ని ఓ రేంజ్‌లో చూపెట్టబోతున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఫైట్స్ అయితే పవన్ కెరీర్‌లోనే బెస్ట్ అనేలా ఉంటాయని టాలీవుడ్ టాక్. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ ను విడుదల చేయాలని సుజీత్ ప్లాన్ చేస్తున్నాడు. సినిమా రేంజ్ ను చూపేలా 72 సెకన్లతో టీజర్ కట్ చేసినట్టు టాక్. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్ దాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతని వాయిస్ ఓవర్ తో సినిమా టీజర్ లో పవన్ విశ్వరూపాన్ని చూపెట్టనున్నాడు సుజీత్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తోంది.🎥🎞️