top of page
MediaFx

బాబాయి కోసం రంగంలోకి అబ్బాయి..


పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేసేందుకు టాలీవుడ్ నుంచి హీరోలు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి వదిలిన వీడియో నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కోసం నాని, తేజ సజ్జా, రాజ్ తరుణ్ వంటి వారు ట్వీట్లు వేసి సపోర్ట్ తెలిపారు. తాజాగా రామ్ చరణ్ సైతం తన మద్దతుని తెలిపాడు. బాబాయ్ కోసం అబ్బాయ్ వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి అని ట్వీట్ వేశాడు.

ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి వారంతా కూడా జన సేన తరుపున ప్రచారంలో పాల్గొన్నారు. జబర్దస్త్ ఆర్టిస్టులు, షకలక శంకర్ వంటి వారు కూడా ప్రచారంలోకి వచ్చారు. చిరంజీవి సైతం ఓ ప్రచార సభలో పాల్గొంటారనే టాక్ వచ్చింది. కానీ ఇలా సోషల్ మీడియాలో వీడియోని వదిలి తన తమ్ముడికి అండగా నిలిచారు. ఓటు వేసి గెలిపించమని పిఠాపురం ఓటర్లను రిక్వెస్ట్ చేశారు.

చిరంజీవి వీడియోని రామ్ చరణ్ షేర్ చేస్తూ.. మీ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి గెలిపించండి అని ట్వీట్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. బాబాయ్ కోసం అబ్బాయ్ వచ్చాాడంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

పోలింగ్ డేట్ దగ్గర పడే కొద్దీ ఇంకా టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్‌కు, జన సేనకు భారీ మద్దతు లభించేలా కనిపిస్తోంది. మరి టాలీవుడ్ మిగతా టాప్ స్టార్లు కదిలి వస్తారా? సోషల్ మీడియాలో అయినా ట్వీట్లేసి మద్దతు ఇస్తారా? అన్నది చూడాలి.



bottom of page