top of page

పవన్ కల్యాణ్ ఘనవిజయంపై అల్లు అర్జున్ స్పందన

జనసేనాని పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఘనవిజయం సాధించారు. పవన్ విజయంపై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. "పిఠాపురంలో తిరుగులేని విజయం సాధించిన పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక శుభాభినందనలు. ఏళ్ల తరబడి మీరు కొనసాగించిన కఠోర శ్రమ, అంకితభావం, ప్రజలకు సేవ చేయాలన్న మీ నిబద్ధత ఎప్పటికీ హృదయాన్ని హత్తుకుంటాయి. మీ ప్రజాసేవ ప్రస్థానంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న తరుణంలో మీకు నా శుభాకాంక్షలు" అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

 
 
bottom of page