top of page
MediaFx

వర్షంలో తడుస్తున్నారా.. జలుబు బారిన పడకూడదంటే..ఈ విషయాలపై శ్రద్ధ పెట్టండి..


వర్షాలు ఖచ్చితంగా వేడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి.. అదే సమయంలో అనేక ఆరోగ్య సమస్యలను కూడా తెస్తుంది. ఈ సీజన్‌లో చాలా మందిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. తరచుగా వర్షంలో తడవడం వల్ల అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. ఈ సీజన్‌లో మంచి ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు. అదే సమయంలో ఈ సీజన్‌లో కొంతమంది తమ ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తారు. దీని వలన వచ్చే పర్యవసానాన్ని అనుభవించవలసి ఉంటుంది. వర్షాకాలంలో పిల్లలతో పాటు ఇంటి పెద్దల పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇంట్లోని పిల్లలు, వృద్ధులలో రోగనిరోధక శక్తిని పెంచడానికి.. అనారోగ్యం బారిన పడకుండా రక్షించడానికి కొని సింపుల్ చిట్కాలను పాటించండి. వర్షాకాలంలో ఎక్కువ మంది చాలా త్వరగా దగ్గు, జలుబు బారిన పడతారు. అటువంటి పరిస్థితిలో చికాకుగా ఉంటుంది. రోజంతా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సీజన్‌లో బ్యాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. దీంతో ఈ సీజన్‌లో జలుబు నుండి ఉపశమనం పొందడానికి లేదా దాని ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్ చిట్కాలను పాటించి చూడండి. అనేక రకాల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు మన చేతుల్లో అభివృద్ధి చెందుతాయి. దీని కారణంగా మీరు మీ ముఖాన్ని పదేపదే చేతులతో తాకినట్లయితే.. బ్యాక్టిరియా సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది. అందుకే ఈ సీజన్‌లో ముఖాన్ని చేతులతో పదే పదే తాకడం మానుకోవాలి.

పుష్కలంగా నీరు త్రాగాలి

వర్షాకాలంలో ఎవరికైనా ఖచ్చితంగా దాహం వెయ్యదు. దీంతో తక్కువగా నీరుని తాగుతారు. దీనికి ముఖ్య కారణం వాతావరణం చల్లగా ఉన్నందున ప్రజలు తరచుగా త్రాగే నీటిని తగ్గిస్తారు. దీని కారణంగా ప్రజలు తరచుగా త్వరగా అనారోగ్యానికి గురవుతారు. శరీరంలో నీటి పరిమాణం తగ్గడం వల్ల రోగనిరోధక శక్తి కూడా బలహీనపడటం ప్రారంభమవుతుంది. ఈ సీజన్లో రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి వీలైనంత ఎక్కువగా నీటిని త్రాగాలి. అది కూడా వేడి నీటిని తాగడం మంచిది.

ఆవిరి పట్టండి

జలుబు నుంచి ఉపశమనం పొందడానికి లేదా దాని ప్రమాదాన్ని నివారించడానికి వారానికి ఒకసారి తప్పనిసరిగా ఆవిరిని పట్టాలి. ఇలా ఆవిరి పట్టడం వలన ముక్కు దిబ్బడ వేయడం వంటి సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. ఆవిరి కోసం పట్టే నీటిలో లవంగం నూనె లేదా టీ ట్రీ ఆయిల్ జోడించాలి.

గోరువెచ్చని నీటితో పుక్కిలించండి జలుబు వచ్చిన వెంటనే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుక్కిలించాలి. ఇది గొంతు నొప్పి సమస్యను చాలా వరకు నయం చేస్తుంది.

bottom of page