'నారప్ప' తో హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల తరువాత సినిమాగా వస్తున్న 'పెదకాపు' 🌟🎬
సంగీతాన్ని సమకూర్చిన మిక్కీ జె మేయర్ 🎶🎵 ఈ నెల 29వ తేదీన సినిమా విడుదల 📅🎥శ్రీకాంత్ అడ్డాల సినిమా, ప్రేమకథలు వినిపిస్తాయి గ్రామీణ నేపథ్యంలోని ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది పల్లెలోని ఆత్మీయతలను అందంగా ఆవిష్కరిస్తూ వచ్చిన శ్రీకాంత్ అడ్డాల అదే పల్లెలోని రాజకీయాలను సహజంగా ఆవిష్కరించడానికి చేసిన ప్రయత్నమే 'పెదకాపు' 🎥
మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా, రెండు భాగాలుగా రూపొందింది 🎬📽️ మొదటి భాగాన్ని ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు 📅 రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు 📢📣 అందులో భాగంగా రేపు ఉదయం ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు 🕦🎬
విరాట్ కర్ణ - ప్రగతి శ్రీవాత్సవ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు 🌟🌟 రావు రమేశ్ కీలకమైన పాత్రను పోషించాడు మిక్కీ జె మేయర్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు 🎶🎵 'నారప్ప' తరువాత శ్రీకాంత్ అడ్డాల నుంచి వస్తున్న ఈ సినిమా, ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందనేది చూడాలి 🎬👀