ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. రాజకీయ పార్టీల మధ్య తీవ్ర స్థాయి విమర్శలకు కారణమైన పెన్షన్ల వ్యవహారంపై దుమారం కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి దూరం పెట్టారు. దీంతో సచివాలయాల్లో Secreteriats పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులతో పంపిణీ చేపట్టారు. వృద్ధులు, వికలాంగులు మినహా మిగిలిన వారంతా సచివాలయాల్లో పెన్షన్లు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 65.69 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేపట్టారు. వివిధ రకాల పెన్షన్ల మంజూరు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసింది. ఆర్ధిక సంవత్సరం ముగింపు, సోమవారం సెలవుకావడంతో మంగళవారం విడుదల చేసిన నిధులు, బుధవారానికి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. వాటిని నగదుగా విత్ డ్రా చేసి పంపిణీ చేపట్టారు.
ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అందరు పెన్షన్‌దారులకు pensioners సాఫీగా పెన్షన్ అందేలా జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేసినట్టు పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలోని మొత్తం 14,994 గ్రామ/వార్డు సచివాలయాల్లో బుధవారం 13,669 సచివాలయాల్లో పెన్షన్ పంపిణీని ప్రారంభించారు. సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు.మినహాయింపు ఉన్న పెన్షన్‌దారులు సచివాలయాలకు రానవసరం లేకుండా ఇంటి వద్దే పెన్షన్ అందజేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్టు అధికారులు ప్రకటించారు.