top of page
MediaFx

పడే ఓట్లు కూడా పోయేలా ఉన్నాయ్..


ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడ నుంచి పోటీ చేయడమే దీనికి కారణం. టాలీవుడ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలిపారు. నిర్మాత నాగవంశీ కూడా పవన్‌కు సపోర్ట్ చేశారు. తాజాగా జర్నలిస్ట్‌ సురేష్ కొండేటి సైతం పవన్‌కు జై కొట్టారు. 

తెలుగు ఇండస్ట్రీలో సురేష్ కొండేటికి మంచి గుర్తింపు ఉంది. గతంలో పలు హిట్ సినిమాలను ఆయన తెలుగులో డబ్బింగ్ చేశారు. సంతోషం పేరిట సినిమా ఆర్టిస్టులకు అవార్డులు కూడా ఇచ్చారాయన మీడియా సమావేశాల్లో హీరో, హీరోయిన్స్‌ను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతూ వార్తల్లో నిలిస్తుంటారాయన. తనపై ఎన్ని ట్రోల్స్ వచ్చిన కూడా ఫేమస్ అవ్వడానికే ఆయన ప్రయత్నిస్తుంటారు.తాజాగా ఆయన పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి మద్దతుగా ఓ పాట పాడారు. 

జనసేన కోసం తాను రూపొందించిన పాటను పాడి వినిపించారాయన. అయితే సురేష్ కొండేటి పాడిన పాటపై ఘెరంగా ట్రోల్స్ వస్తున్నాయి. మళ్లీ పాట పాడటానికి ట్రై చేయకు.. ఈ సాంగ్ వల్ల పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవు అని కొందరు కామెంట్స్ చేస్తూంటే...పిఠాపురం ఓటర్లను చంపేస్తారా అంటూ మరికొందరు నెటిజన్లు సురేష్ కొండేటి పాటపై కామెంట్స్ చేస్తున్నారు. సురేష్ కొండేటి పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


bottom of page