ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ సంస్థ డెల్ కంపెనీకి చెందిన డెల్ 15 ఇంటెల్ ఐ5 ల్యాప్‌టాప్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 67,457కాగా సేల్‌లో భాగంగా కేవలం రూ. 41,490కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 15.6 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌పీ 15 ఎస్ ఇంటెల్ ఐ5 12 జెన్ ల్యాప్‌టాప్‌పై కూడా భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ ల్యాప్‌ట్యాప్ 16 జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 68,223 కాగా డిస్కౌంట్‌లో భాగంగా రూ. 45,490కే సొంతం చేసుకోవచ్చు. ఇక అసుస్ వివో బుక్ 14 ఇంటెల్ ఐ3 ప్రాసెసర్‌తో పనిచేసే ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 56,990 కాగా సేల్‌లో భాగంగా రూ. 29,990కి సొంతం చేసుకోవచ్చు. అలాగే లెనోవో ల్యాప్‌టాప్‌పై కూడా మంచి ఆఫర్ లభిస్తోంది. లెనోవో స్లిమ్ 3 ఇంటెల్ ఐ5-12 జెన్ 16జీబీ ర్యామ్ వేరియంట్ అసలు ధర రూ. 70,090కాగా డిస్కౌంట్‌లో భాగంగా ఈ ల్యాప్‌టాప్‌ను రూ.45,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో లభిస్తోన్న మరో బెస్ట్ డీల్స్‌లో లెనోవో ఐడియా పాడ్ గేమింగ్ 4 ర్యేజెన్ 5 ఒకటి. ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 77,990కాగా సేల్‌లో భాగంగా రూ.39,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఏసర్ అస్పైర్ లైట్ ఇంటెల్ ఐ3 12 జెన్ అసలు ధర రూ. 52,990కాగా సేల్‌లో భాగంగా రూ. 25,990కే సొంతం చేసుకోవచ్చు.
ఇక ఎంఎస్ఐ థిన్ 15 ఇంటెల్ ఐ5 -12 జెన్ ల్యాప్‌టాప్‌పై కూడా మంచి ఆఫర్ లభిస్తోంది. ఆర్టీఎక్స్ 2050 జీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 70,990 కాగా సేల్‌లో భాగంగా రూ. 44,990కే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఏసర్ కంపెనీకి చెందిన ఏఎల్జీ ఇంటెల్ ఐ5 12 జెన్, ఆర్టీఎక్స్ 2050 జీపీయూ ల్యాప్‌టాప్ అసలు ధర రూ. 89,990 కాగా సేల్ భాగంగా రూ. 48,470కే సొంతం చేసుకోవచ్చు.