top of page
MediaFx

శ్రావణ శనివారం వేళ ఈ మొక్కను నాటండి..


సాధారణంగా మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలుసు. మనీ ప్లాంట్ కాకుండా, డబ్బును ఆకర్షించడానికి ఏ మొక్కలు నాటాలో వాస్తు శాస్త్రంలో పేర్కొనబడింది. వాస్తులో పేర్కొన్న ముఖ్యమైన మొక్క శమీ మొక్క. ఇది మీ ఇంటి ఆవరణలో శనివారం నాడు నాటినట్టయితే ఆ శనిదేవుని ఆశీర్వాదం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. అలాగే శని సడేశాతి అంటే ఏడున్నర సంవత్సరాల శని దోశం ఉన్నవారికి ఇది విశేష ప్రయోజనాలను ఇస్తుంది. రెండున్నరేళ్ల శని దోశానికి ఈ మొక్కను రోజూ పూజించాలి. ఇది శనిగ్రహ దోషాల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆవరణలో ఈ శమీ మొక్కను నాటితే, ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది. శ్రావణ మాసంలో శమీ మొక్కను నాటాలి. శ్రావణ శనివారం ఇంట్లో ఈ మొక్కను నాటాలి. అలాగే ప్రతిరోజు ఉదయం శమీ మొక్కకు నీళ్లు పోయాలి. సాయంత్రం ఆవనూనె దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఎలాంటి ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నా తొలగిపోతాయి.

bottom of page