పవన్ కళ్యాణ్ సినిమాలు చేయాలని అనుకుంటున్నారా? లేక రాజకీయంగా ఇంకా ఉన్నత స్థానానికి వెళ్లాలని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సినిమాల పరంగా ఎలాగో.. పొలిటికల్‌గానూ ఆయన సూపర్‌స్టారే. నేనయితే కళ్యాణ్ బాబాయ్‌ని పొలిటికల్ లీడర్ (Political Leader)గానే ఇష్టపడతా. ఆయన స్పీచ్‌లు ఇచ్చేటప్పుడు.. చాలా సార్లు అక్కడ ఉంటే బాగుండేదే అని అనిపించింది. ఆ స్పీచ్‌లు నన్ను ఎంతగానో మోటివేట్ చేశాయి.
మీ బాబాయ్ మీపై ఎప్పుడైనా కోపగించుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. బాబాయ్ ఎప్పుడూ నాపై కోప్పడలేదు. నేను నిహా అని పిలుస్తారు. ప్లీజ్.. ఇలాంటి ప్రశ్నలు మళ్లీ మళ్లీ అడగకండి అని నిహారిక చెప్పుకొచ్చారు. పెదనాన్న, నాన్న, బాబాయ్.. ఈ ముగ్గురిలో ఒక కామన్ థింగ్ చెప్పమంటే.. ‘వారి కళ్లు’ (Eyes) అని తెలిపింది నిహారిక.