ఇండస్ట్రీలో చాలా మంది అద్భుతమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ఉన్నారు. అందులో ఆశిష్ విద్యార్థిఒకరు.. చాలా సినిమాల్లో ఆశిష్ విద్యార్థి నెగిటివ్ రోల్స్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించారు.
1991లో ‘కాల్ సంధ్య’ అనే హిందీ చిత్రంతో ఇండస్ట్రీలోకి వచ్చారు ఆశిష్. పాపే నా ప్రాణం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఇక పోకిరి సినిమా తర్వాత ఆశిష్ విద్యార్థి క్రేజ్ పెరిగిపోయింది. ఆయనకు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో ఛాన్స్ లు వచ్చాయి. ఇక వరుసగా సినిమాలతో దూసుకుపోయిన ఆశిష్ కు ఈ మధ్యకాలంలో ఆఫర్స్ కరువయ్యాయి. మొన్నామధ్య సుహాస్ హీరోగా నటించిన రైటర్ పద్మనాభం సినిమాలో సుహాస్ తండ్రిగా నటించి మెప్పించారు. రానా నాయుడు వంటి వెబ్‌సిరీస్‌లోనూ అదరగొట్టాడు. ఆశిష్ కేవలం తెలుగులోనే కాదు.. కన్నడ, తమిళ్, మలయాళం, బెంగాలీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లోనూ నటించాడు.కానీ ఇప్పుడు ఆయనకు అవకాశాలు కరువయ్యాయి. దీంతో మేకర్స్‌ను రిక్వెస్ట్ చేసుకుంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేశారు ఈయన.