🩹 హిప్ జాయింట్ రిప్లేస్‌మెంట్ తర్వాత.. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారు. యశోద వైద్యుల పర్యవేక్షణలో ఉన్న గులాబీ బాస్‌కు.. రాజకీయాలకు అతీతంగా పరామర్శల వెల్లువ కొనసాగుతోంది.
యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను రాజకీయ నేతలు, ప్రముఖులు పరామర్శించారు. పార్టీలకతీతంగా రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆయనను కలిసి వెళ్తున్నారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కార్యకర్తలకు, నేతలకు విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ ఆస్పత్రికి రావొద్దంటూ కేసీఆర్ కోరారు. రోగులకు ఇబ్బందులు కలిగించొద్దని కోరిన కేసీఆర్.. పార్టీ శ్రేణులు, అభిమానులు సహకరించాలన్నారు. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తా అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ను పలకరించేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు యశోదా ఆసుపత్రికి భారీగా తరలివచ్చారు. మూడు రోజులుగా చాలామంది ఆసుపత్రి పరిసరాల్లోనే ఉండటంతో కేసీఆర్ ఈ వీడియోను విడుదల చేశారు. 🏥👨⚕️