top of page
MediaFx

ప్ర‌ధాని మోదీని ఆహ్వానించిన పాకిస్థాన్‌..


షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ మీటింగ్‌కు ప్ర‌ధాని మోదీని పాకిస్థాన్(Pakistan) ఆహ్వానించింది. అక్టోబర్‌లో ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాల‌యం ఇవాళ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ప్రెస్ బ్రీఫింగ్ సంద్భంగా విదేశాంగ ప్ర‌తినిధి ముంజాత్ జ‌హ్రా బ‌లోచ్ ఈ విష‌యాన్ని తెలిపారు. అక్టోబ‌ర్ 15, 16 తేదీల్లో జ‌ర‌గ‌నున్న స‌మావేశాల‌కు హాజ‌రుకావాల‌ని మోదీతో పాటు ఇత‌ర దేశాధినేత‌ల‌కు ఆహ్వానం పంపిన‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే కొన్ని దేశాలు క‌న్ఫ‌ర్మ్ చేశాయ‌ని, ఇండియా గురించి త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని ఆమె అన్నారు. భార‌త్‌తో నేరుగా ద్వైపాక్షిక పాకిస్థాన్‌కు వాణిజ్యం లేద‌ని జ‌హ్రా వెల్ల‌డించారు.

bottom of page