విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగసుందరంగ ముస్తాబవుతోంది.
విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది రామ భక్తుల చిరకాల స్వప్నం సాకారం అవుతోంది. జనవరి 22న జరిగే విగ్రహా ప్రతిష్ఠాపనకు సర్వం సిద్దమవుతోంది. ఆధ్మాత్మిక విశ్వనగరి అయోధ్య సర్వాంగసుందరంగ ముస్తాబవుతోంది. అయోధ్య రామాలయం ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.. రామమందిర ప్రారంభోత్సవానికి ముందు అయోధ్యలో వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇవాళ అయోధ్యలో మోదీ పర్యటన సందర్భంగా అయోధ్య టెంపుల్ సిటీ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మొదట అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీకి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అనంతరం టెంపుల్ సిటీలో ప్రధాని మోదీ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రధానికి కళాకారులు, ప్రజలు రోడ్డుకు ఇరు వైపులా నిలబడి.. అపూర్వ స్వాగతం పలికారు. పూల వర్షం కురిపిస్తూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు. అయోధ్య నగరానికి 15 కి.మీ.ల దూరాన ఉన్న ఎయిర్‌పోర్టు నుంచి రైల్వేస్టేషనుకు వెళ్లే మార్గం పొడవునా 40 వేదికలపై 1,400 మంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తూ ప్రధాని మోదీకి స్వాగతం పలికారు.
అయోధ్య పర్యటనలో భాగంగా అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. రెండు అమృత్ భారత్ రైళ్లు, ఆరు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ప్రధాని మోదీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమాల అనంతరం మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం పక్కనున్న మైదానంలో ఏర్పాటుచేసే ‘జన్ సభ’లో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.
ప్రధాని పర్యటన సందర్భంగా అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.ప్రధాని సందర్శించే ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో డ్రోన్ల ద్వారా నిఘా పెడుతున్నారు. ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా మొత్తం రీహార్సల్ కూడా చేశారు.. అయోధ్యలో మోడీ పర్యటన నేపథ్యంలో భారత్ – నేపాల్ సరిహద్దుల్లో నిఘాను పటిష్ఠం చేశారు. ప్రధాన రహదారుల్లో మెటల్ డిటెక్టర్లు ఏర్పాటుచేసి, జాగిలాలతోపాటు ఒక ప్లాటూను మహిళా రక్షకదళాన్ని నియమించారు. సరిహద్దులోని ప్రార్థన మందిరాలపై నిఘా పెట్టారు.🤝🎉