top of page
Shiva YT

ఎంపీలతో కలిసి కలిసి లంచ్ చేసిన ప్రధాని మోదీ.. 🤝🍽️

పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోదీ పార్లమెంట్‌ క్యాంటీన్‌‌లో భోజనం చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. బీజేపీ సహా పలు పార్టీలకు చెందిన 8 మంది ఎంపీలను ప్రధాని నేడు లంచ్‌కు ఇన్వైట్ చేశారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్‌, ఎల్‌.మురుగన్‌, బీఎస్పీ ఎంపీ రితేశ్‌ పాండే.. టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తదితరులు ప్రధానితో కలిసి లంచ్ చేశారు. దాదాపు 45 నిమిషాల పాటు ఈ లంచ్ మీటింగ్ కొనసాగింది. పలు కీలక అంశాల గురించి మోదీ నేతలతో చర్చించారు. తనతో పాటు ఆ ఎంపీల భోజనానికి అయిన ఖర్చును ప్రధానే చెల్లించినట్లు నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. 📸👥✨


bottom of page