నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్లను వేయిస్తున్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు హబీబ్ నగర్ పోలీసులు.
నాంపల్లి నియోజకవర్గంలో బోగస్ ఓట్లను వేయిస్తున్న ఎంఐఎం పార్టీకి సంబంధించిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు హబీబ్ నగర్ పోలీసులు. వారి వద్ద నుండి 67 డూప్లికేట్ ఓటర్ ఐడి కార్డులతో పాటు రెండు కెమికల్ బాటిల్స్, ఓటర్ లిస్ట్, ఒక చిన్న ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని నిందితులను కోర్టుకు తరలించారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోగస్ ఓటు వేయిస్తున్న ముగ్గురు ఎంఐఎం పార్టీకి సంబంధించిన సభ్యులను టాస్క్ఫోర్స్, హబీబ్ నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి పట్టుకున్నారు. ఇలా ఎవరు చేయించారు ఎంత మందితో బోగస్ ఓట్లు వేయించారు అని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TSLA-2023) పోలింగ్ సందర్భంగా మంగల్ హాట్ పోలీస్ స్టేషన్‌లోతోపాటూ బార్డర్ పీఎస్ షాహినాయత్ గంజ్ పరిధిలో కొందరు గొడవ పడతూ కనిపించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకండా వెంటనే వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు పోలీసులు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదు. ఇదే క్రమంలో ఫలక్‌నుమ, హబీబ్ నగర్ పిఎస్ పరిధిలోని పోలింగ్ బూత్ నందు కొందరు బోగస్ ఓట్లు వేయటానికి వచ్చిన నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని పట్టుకున్నందుకు సీపీ శాండిల్యా రివార్డు అందించారు.🗳️📲