top of page
Suresh D

ఎన్నికల్లో దళపతి విజయ్‌పై పోటీకి స్టార్ హీరోయిన్🗳️✨

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సందడి షురువైంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇక ఈసారి ఎలక్షన్స్ లో సినీ తారలు పోటీ చేస్తుండడంతో ఆసక్తికరంగా మారింది.

ఈ నేపథ్యంలో తమిళ అగ్రహీరో దళపతి విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నారు. 2026లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీయే లక్ష్యంగా ‘తమిళగ వెట్రిక్‌ కళగం’ పేరుతో తమిళనాడులో రాజకీయ పార్టీని పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో హీరో విజయ్ పై స్టార్ హీరోయిన్ నమిత పోటీ చేస్తానంటూ వెల్లడించింది.

హీరో విజయ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. అతడి సినిమాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుండడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే నటుడు విజయ్ ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. విజయ్ పార్టీ పెట్టడంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో హీరో విజయ్ పై పోటీకి స్టార్ హీరోయిన్ నమిత సై అంటోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత 2026 అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ మీద పోటీ చేస్తానని ప్రకటించింది.

కాగా నమిత తమిళనాడు బీజేపీ పార్టీ కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తరపున నమిత చురుగ్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటు జోష్ నింపుతోంది. ఈ క్రమంలో 2026 ఎన్నికల్లో తాను బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయ్‌పై పోటీ చేస్తానని చెప్పిన నమిత.. విజయ్‌ కూడా రాజకీయాల్లో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేసింది. ఇక నమిత చేసిన వ్యాఖ్యలపై విజయ్ ఫ్యాన్స్ స్పందించారు. హీరో విజయ్ మీద నమిత పోటీ చేస్తే డిపాజిట్లు కూడా ఆమెకు దక్కవని విజయ్ అభిమానులు అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.🗳️


bottom of page