top of page
Suresh D

పక్క రాష్ట్రంలో పవన్ కల్యాణ్ క్రేజ్..🗳️✨

దేశంలో లోక్‌సభ ఎన్నికల ఫీవర్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో అక్కడి నాయకులు చాలా బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిమిషం తీరికలేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

ఇలాంటి ఫుల్ బిజీ షెడ్యూల్ లో కూడా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పక్క రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దం అయ్యింది. కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు ఈ లోక్‌సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ, జేడీఎస్ పార్టీలు సవాల్‌ విసిరాయి. 

కాంగ్రెస్ ను దెబ్బ కొట్టడానికి బీజేపీ, జేడీఎస్ పార్టీలు అనేక వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. కర్ణాటకలో తెలుగు ఓటర్లను ఆకర్షించేందుకు కర్ణాటక బీజేపీ నాయకులు మాస్టర్ ప్లాన్ వేశారు. టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్‌ను కర్ణాటక రాష్ట్రానికి బీజేపీ ఆహ్వానిస్తోంది. ఏప్రిల్ 17వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల తరపున పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేయనున్నారు.లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో 28 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు పలు వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏప్రిల్ 17న రాష్ట్రానికి వస్తున్నారని, బీజేపీ అభ్యర్థుల కోసం ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కానున్నారని బీజేపీ నాయకులు అంటున్నారు. తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న లోక్‌సభ నియోజకవర్గాలు అయిన రాయచూర్, బళ్లారి, చిక్కబళ్లాపూర్, బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గాల్లో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రోడ్ షో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.🗳️ 

bottom of page