వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు.
దాదాపు నాలుగైదేళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ప్రభాస్. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం ఎదురుచూసిన అభిమానులకు సలార్ సినిమా ఫుల్ ట్రీట్ అందించింది. చాలా కాలం తర్వాత ఫ్యాన్స్ కోరుకున్నట్టుగానే వెండితెరపై మరోసారి ప్రభాస్ మాస్ నటవిశ్వరూపం చూపించాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. డార్లింగ్ కటౌట్‌కు.. నీల్ డైరెక్షన్ బిగ్ స్క్రీన్ పై చూసిన అడియన్స్ ఫిదా అవుతున్నారు. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది. రిలీజ్ అయిన వారం రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలు కొడుతుంది. దీంతో ఇప్పుడు డార్లింగ్ తదుపరి సినిమాలపై అదే స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ప్రభాస్ ఇప్పుడు కల్కి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కాకుండా డార్లింగ్ మరో ప్రాజెక్టులోనూ నటిస్తున్నాడు.
అదే డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న సినిమా. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా గురించి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. సైలెంట్‌గా ఈ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమా ఏ జోనర్ ?.. టైటిల్ ఏంటీ ? ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు ? ఇందులో డార్లింగ్ ఎలా కనిపించనున్నారు? కథేంటీ ? ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తాయి. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఇవ్వాలంటూ నెట్టింట పెద్ద యుద్ధమే చేశారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభాస్, మారుతి ప్రాజెక్టు గురించి అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.
ఈ ఏడాది ముగింపులోనే ప్రభాస్ అభిమానులకు శుభవార్త అందించారు మేకర్స్. ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఎట్టకేలకు స్వస్తి చెప్పారు. కాసేపటి క్రితమే ఈసినిమాకు సంబంధించి ఓ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ సంక్రాంతి కానుకగా రివీల్ చేస్తున్నట్లు ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ట్వీట్ చేసింది. అలాగే ప్రభాస్ కటౌట్‌తో కూడిన పెయింటింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా షేర్ చేసిన పోస్టర్ చూస్తుంటే.. మళ్లీ వింటేజ్ ప్రభాస్ ను అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నారని అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు మారుతి, ప్రభాస్ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.🌟🎬