top of page
MediaFx

🌟రెబల్ స్టార్ ప్రభాస్ 'కల్కి 2898AD' విడుదలకు ముందే సెన్సేషన్!


రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన 'కల్కి 2898AD' చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఇండస్ట్రీలో ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ రేంజ్ కి తగ్గట్టుగా మేకర్స్ సినిమా రిలీజ్ కి ముందే భారీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.'బుజ్జి అండ్ భైరవ' టైటిల్ తో అనౌన్స్ చేసిన యానిమేటెడ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమేజాన్ ప్రైమ్ వీడియో లో రెండు ఎపిసోడ్ లతో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ కి మంచి స్పందన వస్తోంది. మిగతా రెండు ఎపిసోడ్స్ 'కల్కి' చిత్రం విడుదల తర్వాత అందుబాటులోకి రానున్నాయి.దీపికా పదుకునే, దిశా పటాని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రంకి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27, 2024న విడుదల కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు, అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

bottom of page