top of page
MediaFx

వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ ఇన్స్ట స్టోరీ.!

🌟 ప్రస్తుతం పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో చేసిన అవైటెడ్ చిత్రం "కల్కి 2898 AD" కూడా ఒకటి. ట్రైలర్ విడుదల తర్వాత ఈ సినిమాపై అంచనాలు ప్రపంచ స్థాయిలో పెరిగాయి!

మన ఇండియన్ సినిమా నుంచి, ప్రత్యేకంగా మన తెలుగు సినిమా నుంచి మరో గర్వించదగ్గ సినిమాగా ఇది మారింది. అయితే, ఇటీవల దర్శకుడు నాగ్ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చెప్పిన విషయం వైరల్ అయింది. మార్వెల్, డీసీ చిత్రాలను ప్రమోట్ చేసినట్లు, ఇప్పుడు మన "కల్కి 2898 AD" ని ప్రమోట్ చేద్దామని ఆయన సూచించారు.

బాహుబలి తో ప్రభాస్ గారు ఇండియన్ సినిమాని, తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలిపారు. ఇప్పుడు, ప్రభాస్ మరియు నాగ్ అశ్విన్ లు కల్కి తో తెలుగు సినిమా అంటే ఏంటో చూపేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ ప్రభాస్ సినిమా, మన తెలుగు సినిమా ప్రతి ఒక్కరం సపోర్ట్ చేద్దాం అని ఆయన చెప్పగా, ఇది 70 వేల మందికి మేర రీచ్ అయ్యి వైరల్ గా మారింది.ఈ అద్భుతమైన ప్రభాస్ సినిమాను మనం అందరం సపోర్ట్ చేసి, పెద్ద విజయంగా నిలపుదాం! 🌠


bottom of page