ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాకు తొలి సమీక్ష వచ్చేసింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. ఫస్ట్ రివ్యూస్ చూస్తుంటే సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు. ట్విస్టులు సినిమాకు హైలైట్ అంటున్నారు. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ములేపేశాడట. నాగ్ అశ్విన్ విజన్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.
ఈ చిత్రం మూడు గంటల నిడివితో ఉంటుందని, ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చెబుతున్నారు. ప్రభాస్ నటన, నాగ్ అశ్విన్ దర్సకత్వం ప్రత్యేక హైలైట్ అవుతాయని అంటున్నారు.
కల్కి 2898 AD ఒక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీ అయినప్పటికీ ప్రమోషన్లు చాలా తక్కువగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా పెద్దగా హడావిడి చేయడం లేదు. అమెజాన్‌లో విడుదలైన యానిమేషన్ ఎపిసోడ్స్ పిల్లలకు బాగా నచ్చాయి కానీ, పెద్ద స్థాయిలో హైప్ మాత్రం రాలేదు.
ఇప్పటికే ఈ మూవీ భారీ స్థాయిలో బిజినెస్ చేసింది. నార్త్ అమెరికాలో ప్రీ-సేల్స్‌తోనే రెండు మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది. కానీ సెన్సార్ నుంచి వచ్చిన టాక్ నిజమా లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.