top of page
MediaFx

మూడు ప్ర‌పంచాల‌తో ప్ర‌చారం అదుర్స్! 🌍🎬

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన‌ ‘క‌ల్కి 2898 AD’ జూన్ 27న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ కానుండ‌టంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రేక్ష‌కుల్లో ఎలాంటి బ‌జ్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. రిలీజ్ స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డ‌టంతో, ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ జోరు పెంచింది చిత్ర యూనిట్.

గురువారం సాయంత్రం ‘క‌ల్కి’ చిత్రానికి సంబంధించిన రిలీజ్ ట్రైల‌ర్ ను లాంచ్ చేస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన మేకర్స్, ఈ సినిమాలోని మూడు ప్ర‌పంచాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ ను వరుస‌బెట్టి రిలీజ్ చేశారు. “శంభ‌ల‌-ఎదురుచూస్తోంది.. కాంప్లెక్స్-ప్ర‌పంచాన్ని ఆక్ర‌మించింది.. కాశీ- చివ‌రి న‌గ‌రం” అంటూ మూడు ప్ర‌పంచాల‌కు సంబంధించిన పోస్ట‌ర్స్ ను రిలీజ్ చేశారు.

ఇలా వ‌రుస అప్డేట్స్, ప్ర‌మోష‌న్స్ తో క‌ల్కి టీమ్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను 2D, 3Dల‌తో పాటు ఐమ్యాక్స్ వెర్ష‌న్ లోనూ రిలీజ్ చేస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రి నేడు సాయంత్రం రిలీజ్ కానున్న ‘క‌ల్కి’ రిలీజ్ ట్రైల‌ర్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. ఈ సినిమాను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయ‌గా అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

bottom of page