top of page
Suresh D

ప్రభాస్ సినిమాకు లీకుల లొల్లి.. కల్కి నుండి వీడియో లీక్ .. 🎥🎞️

ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇప్పుడిలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా ప్రాజెక్ట్ K లీక్ విషయంలో ఇలాంటి సంచలనాలే బయటికి వస్తున్నాయి.

ఇంటిదొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు.. ఇప్పుడిలాంటి ఇంటి దొంగలే ఇండస్ట్రీలో ఎక్కవైపోతున్నారు. పని చేయండ్రా బాబూ అంటూ ఔట్ పుట్ చేతిలో పెడితే.. దాన్ని తీసుకెళ్లి నెట్‌లో పెట్టేస్తున్నారు కొందరు ఆకతాయిలు. తాజాగా ప్రాజెక్ట్ K లీక్ విషయంలో ఇలాంటి సంచలనాలే బయటికి వస్తున్నాయి. అసలు ఈ లీక్స్ గొడవేంటి..? ఇండస్ట్రీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం కాదు.. తీసిన సినిమాలు రిలీజ్ వరకు దాచుకోవడమే కష్టమైపోతుంది. తాజాగా ప్రాజెక్ట్ కేలో ఓ వీడియో లీక్ అవ్వడం సంచలనంగా మారింది. షూటింగ్ మొదలైన రెండేళ్లలో ఫస్ట్ టైమ్ ఈ చిత్రం నుంచి ఓ లీక్ బయటికొచ్చింది. ఈ విషయంపై చిత్రయూనిట్ సీరియస్‌గానే ఉన్నారు. సినిమాకు పని చేస్తున్న ఓ CG కంపెనీ నుంచే ఇది లీకైనట్లు తెలుస్తుంది.

ప్రభాస్ సినిమాలకు ఈ లీక్ ఇష్యూ ఇదే తొలిసారి కాదు. గతంలోనూ సాహోలో ఇంట్రడక్షన్ సీన్ ఇలాగే లీక్ చేసారు. దానికి ముందు బాహుబలి 2లోని ఫైట్ సీన్ అంతా ముందే బయటికి వచ్చింది. అది కూడా ఇంటి దొంగల పనే. గ్రాఫిక్ డిజైనర్స్‌లో ఒకరు ఫుటేజ్ లీక్ చేసారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. 🎥🎞️


bottom of page