ప్రభాస్ రాబోయే చిత్రం "కల్కి 2898 AD" మూవీ ప్రమోషన్స్ సరికొత్తగా చేస్తున్నారు! సినిమాలో పాత్రలతో కాకుండా, ప్రభాస్ వాడిన వెహికల్ మరియు చిన్ని రోబో బుజ్జి తో ప్రమోట్ చేస్తున్నారు. బుజ్జిని ఒక గ్రాండ్ ఈవెంట్‌లో లాంచ్ చేసి, ఆ వెహికల్ ను ప్రధాన నగరాల్లో తిప్పుతూ ప్రమోట్ చేస్తున్నారు. 🚗
తాజాగా వచ్చిన బుజ్జి & భైరవ యానిమేషన్ సిరీస్ కూడా పిల్లలకు ఈ సినిమా బాగా దగ్గర చేయాలనే ఉద్దేశంతో విడుదలైంది. ఈ క్రమంలో బుజ్జి, భైరవ స్టిక్కర్లు, బొమ్మలు, టీ షర్ట్స్ అమ్మడం, కొంతమందికి ఫ్రీగా ఇవ్వడం కూడా చేస్తున్నారు. 🎁
ఇటీవల కల్కి మూవీ టీమ్, సినీ పరిశ్రమలోని సెలబ్రిటీ పిల్లలకు బుజ్జి & భైరవ స్పెషల్ గిఫ్టులు పంపించారు. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారాకు ఈ గిఫ్ట్ పంపించి, బుజ్జి వెహికల్ బొమ్మ, బుజ్జి రోబో బొమ్మ, కొన్ని స్టిక్కర్లు, కల్కి పోస్టర్లు, ఒక లెటర్ పంపారు. క్లిన్ కారా ఆ బుజ్జి వెహికల్ తో ఆడుకుంటున్న ఫోటోను ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసి, కల్కి టీమ్ కి థ్యాంక్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఈ ఫోటో వెంటనే వైరల్ గా మారింది. 📸
ఇలాంటి బుజ్జి గిఫ్టులు మరి కొంతమంది సినీ పరిశ్రమ సెలబ్రిటీ పిల్లలకు కూడా పంపించారు. మొత్తానికి కల్కి సినిమా ప్రమోషన్స్ సరికొత్తగా ట్రై చేస్తున్నారు. పిల్లలకు దగ్గరయి, వాళ్ళతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాకు వచ్చేలా ప్రమోషన్స్ చేస్తున్నారు మూవీ టీమ్. 🎬