🎬 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898AD జూన్ 27, 2024 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. దీపికా పదుకునే, దిశా పటాని ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. యూఎస్ ప్రాంతంలో జూన్ 26 వ తేదీన ప్రీమియర్స్ పడనుంది.
ఈ చిత్రం నుండి విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పటి వరకు $500Kకి పైగా వసూళ్లు రాబట్టింది. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి. డే 1 ఈ చిత్రం ఆల్ టైమ్ రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం తో పాటుగా పలువురు ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.