పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో సలార్ మూవీతో హిట్ అందుకున్న డార్లింగ్.. ఇప్పుడు కల్కి సినిమాతో విధ్వంసం సృష్టించేందుకు రెడీ అయ్యాడు.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దిశా పటానీ, దీపికా పదుకొణే కీలకపాత్రలు పోషిస్తుండగా.. లోకనాయకుడు కమల్ హాసన్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. భారీ తారాగణంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీపై ఇప్పటికే ఓ రేంజ్ బజ్ నెలకొంది. ఈ సినిమాతోపాటు.. డైరెక్టర్ మారుతి డైరెక్షన్లో రాజాసాబ్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో వింటెజ్ డార్లింగ్ కనిపించడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు ప్రబాస్ నటిస్తోన్న మూవీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ కు సంబంధించిన ఓ రేర్ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోలో తనకు ఓ జీవి అంటే చాలా అసహ్యమని.. అసలు నచ్చదనే విషయాలను బయటపెట్టారు. ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్న వీడియోలో ప్రభాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో యాంకర్ మాట్లాడుతూ.. మీకు ఏదంటే ఎక్కువ భయం అని అడగ్గా.. బల్లిని చూస్తే తనకు చాలా భయమని.. బల్లులు అంటే అసలు నచ్చవని అన్నాడు ప్రభాస్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా. డార్లింగ్ కూడా మన బ్యాచే.. బల్లిని చూసి డైనోసర్ భయపడుతుందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్వి్న్ కాంబోలో వస్తోన్న కల్కి ప్రాజెక్ట్ వచ్చే నెల 9న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుహ్యంగా ఈ మూవీని వాయిదా వేశారని టాక్ వినిపిస్తుంది. దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉండడంతో ఈ సినిమాను వాయిదా వేస్తారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. మే 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. కల్కి, రాజా సాబ్ సినిమాల తర్వాత ప్రభాస్ సలార్ 2, స్పిరిట్ చిత్రాల్లో నటించనున్నాడు.