కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ కాన్సెఫ్ట్‌తో రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక మోహనర్ సంబంధించి ఓ సీన్ లోని కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి.
కమర్షియల్ డైరెక్టర్ మారుతి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ కాన్సెఫ్ట్‌తో రాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ మాళవిక మోహనర్ సంబంధించి ఓ సీన్ లోని కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. హీరోయిన్ మాళవిక విలన్లను చితకబాదుతూ కనిపించింది. కూరగాయల మార్కెట్లో ఈ ఫైట్ ను చిత్రీకరిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాని ఇప్పటివరకు 45% పూర్తి చేశారు. అన్నట్టు ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని.. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ప్రభాస్ ఓల్డ్ క్యారెక్టర్ కి ఓ వీక్ నెస్ ఉంటుందని.. ఆ వీక్ నెస్ ఆధారంగా వచ్చే సీక్వెన్సెస్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉంటాయని తెలుస్తోంది.
మరి ఈ సినిమాలో మారుతి ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఇంకా ఎలాంటి ఎలిమెంట్స్ రాశాడో చూడాలి. సహజంగా మారుతి అంటేనే.. చిన్న చిన్న పాత్రలతోనే ఫుల్ కామెడీని పండిస్తాడు. మరి ప్రభాస్ సినిమాతో ఏ రేంజ్ కామెడీని పండిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమా టైటిల్ కోసం ‘రాయల్’, ‘అంబాసిడర్’ అనే టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు టాక్. ఐతే, ‘రాయల్’ అనే టైటిల్ పైనే మేకర్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తమ్మీద మారుతి ఈ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన కామెడీ ట్రాక్ ను సిద్ధం చేశాడట. 🎥🎞️