పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు! నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా, లోకనాయకుడు కమల్ హాసన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. దిశా పటానీ కీలక పాత్రలో నటిస్తున్న ఈమూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
ఈ మూవీ జూన్ 27 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్ర బృందం కసరత్తు చేస్తోంది. ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం ప్రకారం, ట్రైలర్ జూన్ 7న విడుదల కానుందని వినిపిస్తోంది. అయితే, దీనిపై చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.