ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నుంచి రాబోతున్న సినిమా ‘సలార్’. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా సలార్ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.
శ్రుతి హాసన్ హీరోయిన్ గా, మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా, శ్రియారెడ్డి, మరికొంతమంది స్టార్ ఆర్టిస్టులు ముఖ్య పాత్రల్లో భారీ మాస్ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతుంది సలార్.తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజయింది. ఈ టీజర్ కూడా కెజిఫ్ రేంజ్ కంటే మించి ఎలివేషన్స్ తో ఉంది. ప్రభాస్ కి భారీ ఎలివేషన్స్ ఇచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా సలార్ సినిమా కూడా కెజిఫ్ లాగే రెండు పార్టులుగా ఉంటుందని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఇది పార్ట్ 1 అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. టీజర్ చివర్లో పార్ట్ 1 అని ప్రకటించారు. దీంతో సలార్ సినిమా కూడా రెండు పార్టులుగా ఉండబోతుందని కన్ఫర్మ్ ఇచ్చేసారు చిత్రయూనిట్.