100 మంది పిల్లలను చదివిస్తున్న ప్రభాస్..
- MediaFx
- Aug 7, 2024
- 1 min read
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు ఫుల్ జోషలో ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో సలార్ తో సూపర్ హిట్ కొట్టిన డార్లింగ్ ఇప్పుడు కల్కి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు. జూన్27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ ను అందరూ అభిమానించడానికి కారణం అతని దాతృత్వం. డార్లింగ్ తో పని చేసిన ప్రతి ఒక్కరు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా తన తోటీ నటీనటులను ఎంతో ప్రేమగా చూసుకునే ప్రభాస్ వారి కోసం ప్రత్యేకంగా ఇంటి నుంచి భోజనం తెప్పిస్తుంటారు. ఇటీవల ది రాజా సాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ మరోసారి ఈ విషయాన్ని గుర్తు చేసింది. తాజాగా కేరళ వయనాడ్ బాధితులకు భారీ విరాళం ఇచ్చి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు డార్లింగ్. ఏకంగా 2 కోట్ల విరాళం ప్రకటించి సాయం చేయడంలో నిజంగా రాజే అనిపించుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ పై సర్వత్రా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అతని అభిమానులు. ఇదిలా ఉంటే. ప్రభాస్ చేసే దానాలకు సంబంధించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. ఏటా వంద మంది విద్యార్థులకు ఈ స్టార్ హీరో స్కూల్ ఫీజులు కడుతున్నారట. అన్ని దానాల్లో కెల్లా విద్యా దానం గొప్ప దంటారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ మంచి పనే చేస్తున్నాడు. ఓ ప్రముఖ పాఠశాలలో చదువుతున్న దాదాపు వంద మంది పిల్లలకు ప్రభాస్ ఏటా ఫీజులు కడుతున్నాడట. అంతేకాదు ఆ 100 మంది పిల్లలకు ప్రభాసే దుస్తులు దగ్గర నుంచి పిల్లలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తున్నాడట.ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలిసి అభిమానులు ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత దాన ధర్మాలు చేస్తున్నా ఎక్కడా ప్రచారం చేసుకుని ప్రభాస్ ను ఎంత పొగిడినా తక్కువేనంటున్నారు. అయితే ప్రభాస్ చదివిపిస్తున్న పిల్లలు హైదరాబాద్‌లో చదువుకుంటున్నట్లు కొంతమంది తెలుపుతుండగా.. మరికొంతమంది.. భీమవరం అని కామెంట్స్ పెడుతున్నారు.